*ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వంగవీటి మోహన రంగా గారి సేవలను యువత మరవకూడదని అన్నారు. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు, చిట్టవరం గ్రామాల్లో వంగవీటి రంగా గారి కాంస్య విగ్రహాలను ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ, రంగా గారి అడుగుజాడల్లో యువత నడవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాధాకృష్ణ మాట్లాడుతూ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ కన్వీనర్ మేకల సతీష్, స్వాతంత్ర్య సమరయోధుడు మేడిద సీతారామయ్య కుమారుడు మాధవ కృష్ణారావు, కూటమి నాయకులు, రంగా అభిమానులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. ఘనంగా గజమాలలతో రాధాకృష్ణకు స్వాగతం పలికారు.
Share this content:
Post Comment