సత్తెనపల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి వర్థంతి వేడుకలు

సత్తెనపల్లి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన వర్థంతి వేడుకల్లో భాగంగా ముందుగా మాదల గ్రామం జనసైనికుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు పాల్గొని రంగా విగ్రహానికి నివాళులర్పించి వారి ఆశయాలు జనసేనతో సాధ్యమని తెలియచేశారు.. తదుపరి రుద్రవరం గ్రామం, బ్రుగభండ గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలో రంగా అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూల మాలలతో నివాళులర్పించి రంగా గారు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగం చరిత్ర ఎన్నటికీ మరువదని ఆయన ఆశయాలకై జనసేన పోరాడుతుందని కొనియాడారు. అనంతరం రాజుపాలెం మండలంలో రంగా గారి అభిమానుల ఆహ్వానం మేరకు అబిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రంగా గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన త్యాగాలను, ధైర్య సాహసాలను ప్రత్యర్ధి పార్టీలపై ఆయన చేసిన పోరాటాలను కొనియాడుతూ రాజకీయాలలో ఆయన ప్రస్థానం తెలుగుజాతి ఉన్నంతకాలం చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేశారు. ఆ తరువాతగా నేకరికల్లు మండల కుంకులగుంట, చేజర్ల గ్రామాలలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రంగా గారు ఒక్క కులానికి మాత్రమే నాయకుడు కాదు అన్ని వర్గాలవారికి ఆయన ఒక స్పూర్తిదాయకం మరియు అన్ని వర్గాలవారి గుండెల్లో ఆయన స్థానం చిరస్మరణీయం అని రంగా గారి పోరాటాలను గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్, సత్తెనపల్లి రూరల్ మండలాధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, రాజుపాలెం మండలం అధ్యక్షులు తోట నరసయ్య, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, ఉప్పల మండలం వైస్ ప్రెసిడెంట్, షేక్ గౌస్, రాజుపాలెం మండలం వైస్ ప్రెసిడెంట్, బత్తుల హనుమంతరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నాగభూషణం, దూళిపాళ్ల మాజీ సర్పంచ్ చిలక సత్యం, మరియు షేక్ జాన్ పీరా, తూలవా సీతయ్య, కేదారి రమేష్ రామి శెట్టి సన్నీ, పసుపులేటి మురళి, ఛాతికిల ఏడుకొండలు, స్వరూపు, సైదా మస్తాన్, పెద్ద ఎత్తున జనసైనికులు కార్యకర్తలు పాల్గొని రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించారు.