సౌత్ ఆఫ్రికాలో వారాహి యాత్ర వార్షికోత్సవ వేడుకలు

*వారాహి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా సౌత్ ఆఫ్రికాలో సేవా కార్యక్రమం
*పేదల కోసం బ్లాంకెట్ డ్రైవ్ నిర్వహించిన జనసేన సౌతాఫ్రికా టీమ్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, సేవా కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా కొనసాగిస్తున్న జనసేన కార్యకర్తలు, సౌతాఫ్రికా జనసేన టీమ్ వినూత్నంగా సేవా మార్గాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా 2025 జూన్ 14, శనివారం రాత్రి జోహానెస్‌బర్గ్ నగరం – మేరీవాలే ప్రాంతంలో ఏర్పాటు చేసిన “బ్లాంకెట్ డ్రైవ్” కార్యక్రమంలో పేద ప్రజలకు కనీస అవసరమైన కంబళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సౌతాఫ్రికా జనసేన టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. “2024 జూన్ 14న పవన్ కళ్యాణ్ శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించిన వారాహి యాత్ర ఏకంగా తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో విప్లవాత్మకంగా మారింది. కూటమి విజయానికి బాట వేసి, 100% విజయాలతో సార్వత్రిక ఎన్నికల్లో విశేష ఘనతను సాధించిన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే రోజు సేవా కార్యక్రమం చేయడం మాకు గర్వకారణంగా ఉంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన సౌతాఫ్రికా టీమ్ సభ్యులు: గనిశెట్టి శ్రీనివాస్, సీతారాం కోనే, అంబికా కోనే, పసుపులేటి రాజగోపాల్, ప్రియాంక మునగా, విష్ణు కోడె, సురేష్ కుటూరు, మాధురి కుటూరు, మోహన్ కోనే, అనిల్ సత్య పారెపల్లి, సోమేశ్వరి పారెపల్లి, తాడేపల్లి రాంబాబు, సుధీర్ బోనం, మజ్జి శ్రీనివాసరావు, వివేష్ సల్లాడి, అనిల్ సీతలం, చీమట అంజి, జాలే జ్యోతి, ప్రణతి పసుపులేటి, ఈశ్వరి బచ్చు, రాజశేఖర్ బచ్చు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ, అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గనిశెట్టి శ్రీనివాస్ (గుంటూరు) ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే, సౌతాఫ్రికాలోని జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

WhatsApp-Image-2025-06-15-at-5.39.38-PM-1-1024x768 సౌత్ ఆఫ్రికాలో వారాహి యాత్ర వార్షికోత్సవ వేడుకలు

Share this content:

Post Comment