వారహి యాత్ర ప్రారంభం సన్నహాలు

జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జూన్ 14వ తేదీన చేపట్టబోతున్న వారాహి ప్రారంభ యాత్రను విజయవంతం చేయడానికై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామమోహన్ (గాంధీ) కలిసి ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్చార్జ్ వోరుపుల తన్మయ్య బాబు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రజల్ని యాత్రకు వచ్చే విధంగా వారిని చైతన్యవంతుల్ని చేసి, ఈ కార్యక్రమాన్ని ఎలా దిగ్విజయం చేయాలనే పలు అంశాలపై వారితో చర్చించి, వారాహి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి, మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) ఏర్పాటు చేసిన వారాహి ప్రచార రథాలను జెండా ఊపి ముందుకు ప్రారంభించి, అనంతరం ఈ యాత్ర విజయవంతం అవ్వాలని అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.