ముత్తుకూరులో జనసేన వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

సర్వేపల్లి నియోజకవర్గం: ముత్తుకూరు నందు గురువారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదేశాల మేరకు జనసేన వారాహి యాత్ర పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. జూన్ 14వ తేది ఉభయగోదావరి జిల్లాలో ఘనంగా ప్రారంభం కానున్న వారాహి యాత్రకి సంబంధించి పోస్టర్ ని ముత్తుకూరు మండల జనసేన పార్టీ నాయకులు షేక్ రహీమ్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు వారాహి యాత్ర పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించింది. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని విముక్తిని చేయడం కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేస్తామని, అదే విధంగా వారాహి యాత్రతో ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న వైసిపి నాయకులకి అప్పుడే వణుకు మొదలైంది. నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి చేయకపోగా ఈ అధికార పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా వీరి లక్ష్యమేందంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాత్రమే అందుకే రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో వీళ్ళందర్నీ ఇంటికి పంపించే దానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీహరి, యోగి, బాబు, మునిరాజా, వినాయక్, సుమన్, సాయి తదితరులు పాల్గొన్నారు.