వారాహి యాత్ర విజయవంతం అవ్వాలి: డాక్టర్. యుగంధర్ పొన్న

  • రాష్ట్రాన్ని దిశా నిర్దేశం చేసే యాత్ర
  • ప్రజల క్షేమం కోరి చేస్తున్న యాత్ర
  • 2024లో ఏపీకి కాబోయే సీఎం శ్రీ పవన్ కళ్యాణ్
  • గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 2024లో కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ యుగంధర్ పొన్న
  • పార్టీ బలోపేతం మరియు ప్రజా సమస్యలే ప్రధాన అజెండా,

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14న తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని, దిగ్విజయంగా ముందుకు సాగాలని, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో ఎస్ఆర్ పురం మండలంలో అరిమాకుల గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్వేటి నగరం మండల కమిటీ అధ్యక్షులు శోభన్ బాబు ఆధ్వర్యంలో వరాహి యాత్ర పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది.