వారాహి యాత్ర విజయవంతం కోసం మదనపల్లి జనసేన ప్రత్యేక పూజలు

మదనపల్లి: జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ జూన్ 14వ తారీఖున చేపట్టబోతున్న వారహి యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో యాత్ర ప్రారంభం సందర్భంగా వారహి యాత్ర దిగ్విజయం కావాలని శనివారం మదనపల్లి బసినికొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి 101 టెంకాయల కొట్టి, బసినికొండ మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అవినీతి పాలన దుర్మర్గపుపాలన నశించి పోవాలని వైసీపీ విముక్తా ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త మదనపల్లి ద్యేయంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగుల్లో అడుగు వేసుకొంటూ ముందుకు సాగుతాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్త్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, తోట కళ్యాణ్, కుమార్, రెడ్డెమ్మ, జనార్దన్, అర్జున, లక్ష్మీపతి, భరత్ సింగ్, నాగ, సత్య, అఖిల్, ఉమా, మధు, అక్షయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.