వారాహి యాత్ర స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు ఆవిష్కరించిన కందులు దుర్గేష్

పిఠాపురం: తుని పట్టణంలో శ్రీ సాయి శ్యామల ఫంక్షన్ హాలు నందు శనివారం జరిగిన జనసేన కార్యకర్తలు సమావేశం అనంతరం పిఠాపురం నియోజకవర్గం నందు జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహియాత్రకు సంబంధించిన జ్యోతుల శ్రీనివాసు ప్రింటింగ్ చేయించిన స్టిక్కర్లను, వాల్ పోస్టర్లులను, పాంప్లెట్లను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్, రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బొణబోయిన శ్రీనివాసు యాదవ్, రాష్ట్ర జనసేన కార్యదర్శి తాతాంశెట్టి నాగేంద్ర కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, జిల్లా జనసేన సహయ కార్యదర్శి పలెవల నాగ లొవరాజు, చోడిశెట్డి గణేష్, దొడ్డిపట్ల సూర్య చంద్ర, నల్లల రాజు, వీర్ల శ్రీను, అల్లం దొరబాబు, దమ్ము, ఎం. సత్తిబాబు, ఉలవకాయల వీరబాబు, పేకేటి వెంకటరమణ, జ్యోతులు గోపి, జ్యోతుల శివ, ఆకుల ముక్తేశ్వరరావు, అల్లం కిషోర్, కొలా నాని, జీలకర్ర బాను తదితరులు పాల్గొన్నారు.