వారాహి యాత్ర వైసీపీ అరాచక పాలన నుండి విముక్తికి నాంది

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ కాలవగడ్డ ఆంజనేయస్వామి గుడివద్ద యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేయించి, వాహనాలతో ర్యాలీగా వచ్చి సర్కిల్లో కేక్ కట్ చేసి వారాహి యాత్రకు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారాహి యాత్రపై రచయిత శ్రీనివాస్ రాసిన పాటను కొత్తచెరువు పార్టీ కార్యాలయం నందు జనసైనికుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పూల శివప్రసాద్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని ప్రజల మద్దతును కూడగట్టి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును ఐక్యం చేసి వచ్చే ఎలక్షన్లో అధికారాన్ని చేపట్టి, రాష్ట్రం యొక్క అప్పుల బాధ నుండి, దుర్మార్గపు పాలన నుండి విముక్తి కలిగించి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.