వారాహి యాత్ర వాలంటీర్ కోర్ కమిటీ సమావేశం

పాయకరావుపేట: వారాహి యాత్రలో భాగంగా జూన్ 15, 16వ తేదీలలో పిఠాపురంలో జరిగే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశాలకు, అదేవిధంగా ఉప్పాడలో జరగబోయే బహిరంగ సభకు వాలంటీర్స్ గా పనిచేయడానికి ముందుకు వచ్చిన నియోజకవర్గ జనసైనికులతో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా వారాహి యాత్ర కార్యాచరణ నిమిత్తం చర్చించి, యాత్ర విజయవంతం చేసే దిశగా దిశా నిర్దేశం చేయడం జరిగినది.