జనసైనికుల్లో కేరింతలు కొట్టిస్తున్న వారాహి యాత్ర

  • నగరంలో 50వేల ఇళ్లకు వారాహి యాత్ర ఆహ్వాన పత్రాలు
  • జనసేన పార్టీ పిసి సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్

కాకినాడ: జూన్ 14న ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధి నుండి భీమవరం వరకు నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసైనికులు కసరత్తులు చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ వారహీయాత్ర విజయవంత చేయడానికి జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారని పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో వారహి యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భవిష్యత్ తరాల ప్రగతికి పునాదులు వేసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ రానున్న నేపథ్యంలో ఆయనకు భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు, తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో నిరంతర సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ రాక కొరకు కాకినాడ నగరంలో కనీ, విని ఎరుగని రీతిలో జనసైనికులు వారాహి యాత్ర విజయవంతం చేయనున్నారని, ఇప్పటికే కాకినాడ నగరంలో సుమారు 50000 ఇళ్లకు వీరమహిళల ఆధ్వర్యంలో వారహి యాత్ర ఆహ్వాన లేఖలు ఇంటింటికి అందజేయడం జరిగిందని, ముత్తా శశిధర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూలు వెలువడిన తర్వాత నా జిల్లా వ్యాప్తంగా జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం వేస్తుందని తెలిపారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ విజయ డంకా మ్రోగించడం తధ్యమని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రభుత్వం వారాహిని అడ్డుకోవడానికి దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్యటనపై అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలం పుట్టి గందరగోళానికి గురవుతున్నారని, పవన్ కళ్యాణ్ ఆదరణను జీర్ణించుకోలేని వైకాపా నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని సెక్షన్ 30 పోలీస్ యాక్టను అమలు పరచడం వెనుక వైకాపా పిరికితనం బయటపడుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుంకర సురేష్, నరసింహ కుమార్ భగవాన్ సతీష్, సుజాత మాలతి హైమావతి దీప్తి. కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.