ఎన్టీఆర్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మి?

ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తనయగా చిత్రసీమకు పరిచయమైన వరలక్ష్మి ఇప్పుడు ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. విలనీతో కూడిన కొన్ని రకాల పాత్రలకు.. ఫెరోషియస్ క్యారెక్టర్లకు ఆమె కొత్త చిరునామాగా మారింది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా వుంది. ఇటీవలి కాలంలో ‘క్రాక్’, ‘నాంది’ సినిమాలలోని పాత్రలలో ఆమె ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ క్రమంలో వరలక్ష్మికి టాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలకు దీటుగా వుండే పాత్రలను కూడా ఆమెకు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ రూపొందించే చిత్రంలో ఆమెకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ సినిమా నుంచి కూడా ఆమెకు ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే సినిమాలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రను ఆమెకు ఆఫర్ చేసినట్టు సమాచారం