యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన వరికూటి సోదరులు

దర్శి, జనవరి 12వ తారీఖున రణస్థలం వేదికగా శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ “యువశక్తి” కార్యక్రమం పోస్టర్ను దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు మరియు జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ వ్యవస్థాపకులు సురేష్ వరికూటి వారి కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై వారి గళం వినిపించనున్న యువతీ యువకులకు ఈ సభా ప్రాంగణం ఒక మంచి వేదికగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుల జగదీష్ నాయుడు, గనపా శ్రీనివాసులు, వేమ శివ, పవన్, నీలిశెట్టి సురేష్, పాశం శ్రీనివాసులు పాల్గొనడం జరిగినది.