జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన వరికూటి నాగరాజు

కనిగిరి నియోజకవర్గం, హనుమంతునిపాడు మండలం, హనుమంతుని పాడు గ్రామంలో జెండా ఆవిష్కరణ మరియు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు పాల్గొని జెండా ఆవిష్కరణ మరియు కార్యాలయ ప్రారంభోత్సవం చేయడం జరిగినది. తదుపరి మీటింగులో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి కృషి చేసిన జనసేన పార్టీ నాయకులు శానం ఆంజనేయులు మండల సీనియర్ ఆకుపాటి వెంకటరావు, కూడలి మల్లికార్జున, కమలాకర్, మరియు తమ వంతు కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. రానున్న రోజుల్లో జనసేన-టిడిపి-బిజెపి కూటమి విజయం తద్యమని ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. అలాగే 17న జరిగే జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి కూటమి మీటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలోని బూతులు చైతన్యపరిచి కూటమి విజయానికి తమ వంతు కృషి చేయాలన్నారు తదుపరి పార్టీ కార్యాలయానికి సహకరించిన వారిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్బర్, కోటంశెట్టి మధు, సాయి కిషోర్, దైవ, నాగేంద్ర, ప్రవీణ్, చంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.