రాజమండ్రి సిటీ జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

  • రాజమండ్రి సిటీ జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

రాజమండ్రి సిటీ: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆనం రోటరీ వద్ద ఉన్న బీసీ బాలుర హాస్టల్ లో విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ మరియు సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సిటీ కార్యవర్గ సభ్యులు నగర జనసేన నాయకులు, జనసేన యువ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.