చిన్ననాటి ప్రేయసిని పెళ్లాడిన వరుణ్ ధావన్

మొత్తానికి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక ఇంటివాడయ్యాడు, చిరకాల ప్రేయసి నటాషా దలాల్ లతో ఆదివారం వివాహం జరిగింది. గత ఏడాది నుంచి వీరి పెళ్లికి సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అసలైతే గత ఏడాదిలోనే వీరి పెళ్లి జరగాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు. ఇక వివాహ ఆచారాలు ముగిసిన తర్వాత వారు మీడియాకు పోజులిచ్చారు.

ముంబైలోని అలీభాగ్ 5 స్టార్ హోటల్‌లో ఇరువురి సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక సోషల్ మీడియాలో వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు కొందరు హీరోలు కూడా వచ్చారు. ఇక డేవిడ్ ధావన్‌కు సన్నిహితులైన కొందరు దర్శక నిర్మాతలు పెళ్లి వేడుకకు వచ్చారు.

ఇక శనివారం రాత్రి వరుణ్ ధావన్ తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీని కూడా చేసుకున్నాడు. పార్టీ పూర్తి చేసుకొని హోటల్ కు తిరిగి వస్తుండగా ఒక చిన్న యాక్సిడెంట్ కు గురైనట్లు కథనాలు కూడా వచ్చాయి. అయితే అదేమీ పెద్ద ప్రమాదం కాదని ఆ తరువాత క్లారిటీ ఇచ్చారు. ఇక పెళ్లి వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ ను ఎవరిని పెద్దగా పిలవలేదు. వారి కోసం రిసెప్షన్ పార్టీని గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారు.