ఘనంగా వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరు: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 33వ జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరు జనసేన తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక భవిత మానసిక వికలాంగుల కేంద్రంలో వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలను పిల్లలకు బ్రెడ్డు పండ్లు బిస్కెట్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ఇలాంటి పుట్టినరోజు లు ఎన్నో జరుపుకోవాలని, ఆయన నటించబోయే సినిమాలు ఘన విజయం సాధించాలని, మెగా అభిమానులకు ఎనలేని ఆనందం ఇవ్వాలని, రాబోయే రోజుల్లో మెగా హీరోల సేవాస్పూర్తితో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, గోవర్ధన్, చిట్టి తదితరులు పాల్గొన్నారు.