నందిగామ జనసేన ఆధ్వర్యంలో వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, నందిగామ పట్టణంలోని జి3 మయూరి థియేటర్ నందు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తనయుడు కొణిదెల వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా టీం పవన్ ఆర్మీ & టీం వరుణ్ తేజ్ ఆధ్వర్యంలో నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు వరుణ్ తేజ్ మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.