రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వాసగిరి మణికంఠ

గుంతకల్, పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఉమ్మడి అంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ బాధ్యుడు వాసగిరి మణికంఠ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్‌ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని అన్నారు. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం ఎంత సంతోషంగా ఉంటుంది అని పేర్కొన్నారు.

Share this content:

Post Comment