గోపి కుటుంబానికి అండగా వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: గుంతకల్ పట్టణ చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర నాయకులు గోపి గారాల కొడుకుకు ఆడుకుంటుండగా ప్రమాదశాత్తు చేయి ఫ్రాక్చర్ అయిందని గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ నుంచి విషయం తెలుసుకున్న గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి, తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందించి, ధైర్యంగా ఉండాలని ఏ అవసరం వచ్చినా మేమున్నామని భరోసాని ఇచ్చారు. పరామర్శించిన వారిలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సుబ్బయ్య, కత్తులగేరు అంజి, అనిల్ కుమార్, వంశీ తదితరులు ఉన్నారు.