దేవర మహోత్సవంలో పాల్గొన్న వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: ధోనిముక్కల గ్రామ ఊరిదేవర కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ. బుధవారం జనసేన కుటుంబ సభ్యులు (రాజశేఖర్, మోహన్ రాయల్) ఆత్మీయ ఆహ్వానం మేరకు గుంతకల్ మండలం ధోనిముక్కల గ్రామం ఊరిదేవర మహోత్సవానికి హాజరై జనసేన, కాపు సంక్షేమసేన శ్రేణులతో పెద్దమ్మ గుడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న వాసగిరి మణికంఠ అనంతరం ఆత్మీయ బంధుమిత్రుల ప్రతి ఇంటికి వెళ్లి ఆత్మీయ ప్రేమ అనురాగాలతో పలకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, ఆటో రామకృష్ణ, సుబ్బయ్య, కత్తులవీధి అంజి జనసైనికులు అమర్, మంజునాథ్ కాపు సంక్షేమసేన సీనియర్ నాయకులు కసాపురం రామాంజనేయులు, కప్పట్రాళ్ల కోటేశ్వరరావు, రాయల్ రంగ, పాపిరెడ్డి, వంశీ, మోహన్, ఉదయ్, అశోక్, ఆది, దాసిరెడ్డి, ప్రశాంత్ నిస్వార్థ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.