పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ జయకేతనం సభకు వీరఘట్టం మండలం నుండి జనసైనికులు భారీగా బయలుదేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ – “యువత రాజకీయ ప్రయాణంలో ముందుండి నడిపిస్తున్న పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నాతో కలసి నడుస్తున్న పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు 12వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు” అన్నారు. అలాగే, “కష్టాల కడలిలో గుండెల నిండా ధైర్యంతో, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో పిఠాపురంలో జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవ సభకు పాలకొండ నియోజకవర్గ జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్, సీనియర్ నాయకులు మత్స పుండరీకం, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ పొట్నూర్ రమేష్, వీరఘట్టం జనసేన నాయకులు రౌతు గోవిందా నాయుడు, దత్తి గోపాలకృష్ణ, సరపల్లి అచ్యుత్, నందివాడా పండు, సిరాపు నాగరాజు, పుప్పాల పురుషోత్తం, రౌతు నవీన్, జామి అనిల్, మెడిద సందీప్, దండేలా సతీష్, సొండి సుమన్, బొత్స కార్తీక్, ఊయక శ్రీనివాసరావు, గుంట్రెడ్డి శ్రీనివాసరావు తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment