వేకానంద డిగ్రీ కళాశాల జనసేన విద్యార్థి విభాగ కమిటీ ప్రకటన

హైదరాబాద్, జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆదేశాలతో జనసేన విద్యార్థి విభాగ వివేకానంద డిగ్రీ కళాశాల కమిటీ ప్రకటించిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేష్ పెంటల. జనసేన విద్యార్థి విభాగం బలోపేతంలో భాగంగా శుక్రవారం విద్యానగర్ లోని వివేకానంద డిగ్రీ కళాశాల సందర్శించి నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాయిన్ జనసేన విద్యార్థి విభాగం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విద్యార్థులు ఉత్సాహంగా జనసేన విద్యార్థి విభాగంలో చేరడం జరిగింది. విద్యార్థుల సమస్యలను కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల జనసేన విద్యార్థి విభాగం కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేష్ పెంటల, ఓయూ ప్రెసిడెంట్ వినోద్ నాయక్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి దార ప్రణీత్, విద్యార్థి నాయకులు అలువాల అజయ్, సుంకర వంశీ పాల్గొన్నారు.