కాపులపై కపట ప్రేమ నటిస్తున్న వెల్లంపల్లి: తిరుపతి అనూష

విజయవాడ: వెల్లంపల్లి శ్రీనివాస్ కాపులపై కపట ప్రేమ నటిస్తు పదేపదే కాపులని అవమానిస్తున్నారనటానికి అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని జనసేన పార్టీ 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష పేర్కొన్నారు. బుధవారం మీడియా సమావేశంలో అనూష మాట్లాడుతూ.. వైసిపి కార్పొరేటర్ భర్త అత్తులూరి పెద్దబాబు కేబుల్ మాఫియా నుండి కాపాడమని ప్రార్థిస్తే వారిని పట్టించుకోకుండా వదిలేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడబోయారు. సీనియర్ కాపు నాయకులు సామినేని ఉదయభాను గారిపై ఇష్టానుసారం బూతులు మాట్లాడి నలుగురిలో అవమానించారు. మరొక సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు వారి ఇంట్లో శుభకార్యం గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఇస్తే అదేదో పెద్ద నేరంలాగా ఆయన్ని తీవ్రమైన పదజాలంతో దూషించి అవమానించారు. రెండు రోజుల క్రితం ఆర్యవైశ్య సామాజిక వర్గం వారు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి బోండా ఉమామహేశ్వర రావు గారు వారి సొంత స్థలంలో ఏర్పాటు చేసుకోమని పెద్ద మనసుతో ముందుకు వస్తే వారిని ఆర్యవైశ్య సామాజిక వర్గ వన సమారాధనలో అవమానించావు. న్యాయవాది భగవాన్ గారి విషయంలో సరైన రీతిలో ఎందుకు స్పందించలేదు. మువ్వల మోహన్ అనేటువంటి ఆటో డ్రైవర్ని వైఎస్ఆర్సిపి పార్టీ తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేస్తే కనీసం స్పందించలేదు. నీకు ప్రజారాజ్యంలో వంగవీటి రాధా గారి ఆశీస్సులతో అసెంబ్లీ సీటు పొందావు ఆయనపై రెక్కీ నిర్వహించే వారికి మద్దతిచ్చిన దుర్మార్గుడువు నువ్వు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు వ్యవహారశైలిపై కాపు సామాజికవర్గ నాయకులు భగ్గుమంటున్నారు. తమను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపులనే లక్ష్యంగా చేసుకుని వెలంపల్లి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారని, రాజకీయ భిక్ష పెట్టిన నాయకులనే వ్యక్తిగతంగా దూషిస్తూ దాడులు చేయించడానికీ వెనుకాడటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ వారినీ వదలకుండా వేధిస్తుంటారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కాపులంటే కక్షా.. వెలంపల్లి తీరుపై భగ్గుమంటున్న కాపులు రాజకీయ భిక్ష పెట్టిన వంగవీటి రాధాకు అవమానం సి. రామచంద్రయ్య, తోట నరసింహం, సామినేని ఉదయభానులతోనూ గొడవలే.. తాజాగా బొండా ఉమాపైనా దూషణల పర్వం ఆది నుంచీ కుట్రలే.. ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తొలుత వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత వెలంపల్లిని తీసుకెళ్లి చిరంజీవికి పరిచయం చేసి పార్టీలో చేర్చారు. పార్టీలో తన ఆధిపత్యం కొనసాగాలన్న లక్ష్యంతో వెలంపల్లి.. చిరంజీవి, రాధాకృష్ణ మధ్య గొడవలు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి చిరంజీవికి తాను దగ్గరై రాధాను అవమానించేలా వ్యవహరించారు. ఇటీవల రాధా ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించిన సంఘటనలో కూడా వెలంపల్లి పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దుర్గగుడి ఈవోగా తాను చెప్పిన అధికారిని నియమించాలని గతంలో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేసిన సి. రామచంద్రయ్యను వెలంపల్లి కోరారు. ఆ సమయంలో ఆయన పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, వెలంపల్లి చెప్పిన వ్యక్తిని నియమించలేదని నాడు రామచంద్రయ్యను లక్ష్యంగా చేసుకుని వెలంపల్లి అసత్య ఆరోపణలు చేసి దూషించారు.
కిరణ్ కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి తోట నరసింహారావు దుర్గగుడికి వస్తే ఆయనకు ప్రొటోకాల్ ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక భవానీపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆకుల శ్రీనివాసకుమార్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరుతానని ఏడాదిన్నరపాటు వెలంపల్లి చుట్టూ తిరిగినా ఆయన్ను సీఎం వద్దకు తీసుకెళ్లలేదు. పైగా అవమానపరిచారు. దీంతో ఆకుల శ్రీనివాసరావు జగ్గయ్యపేట శాసనసభ్యుడు సామినేని ఉదయభాను ద్వారా ముఖ్యమంత్రిని కలిశారు. ఈ విషయం తెలుసుకున్న వెలంపల్లి శ్రీనివాసరావు ఆకుల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కక్ష పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉదయభాను హాజరయ్యారు. అదే సమయంలో వెలంపల్లి శ్రీనివాసరావు కూడా హాజరై ఉదయభానుతో గొడవ పడ్డారు. ఆకుల శ్రీనివాసకుమార్ను సీఎం వద్దకు ఎందుకు తీసుకెళ్లావని కులం పేరుతో దూషించి ఉదయభానుపై దాడికి ప్రయత్నించారు. ప్రస్తుత దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కూడా అనేక విధాలుగా వెలంపల్లి అవమానపరుస్తున్నారు. వెలంపల్లి దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టారు. దీంతో వెలంపల్లి శ్రీనివాసరావు మంత్రిపై కక్ష పెంచుకుని దుర్గగుడిలో ఓ వర్గాన్ని మంత్రిపైకి ప్రోత్సహిస్తూ అవమానపరిచారు. ఇటీవల జరిగిన దసరా ఉత్సవాల్లో కూడా వెలంపల్లి 50 నుంచి 60 మందిని వెంటబెట్టుకుని దుర్గగుడికి వెళ్లి కొండపై ఉన్న మంత్రి కొట్టు సత్యనారాయణను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. దుర్గగుడి ఈవో నియామకంలో కూడా తాను చెప్పిన అధికారినే బదిలీ చేయాలంటూ దేవదాయ శాఖ మంత్రిపై ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారా ఒత్తిడి చేయించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజికవర్గ కార్పొరేటర్లను కూడా వెలంపల్లి అవమానపరుస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తన మాట వినని కార్పొరేటర్ల డివిజన్లో పనులు చేయవద్దంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సింగ్ నగర్ ఆర్యవైశ్యులు నున్నలో వనసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడాహాజరయ్యారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావును వెలంపల్లి అకారణంగా దూషించి, కయ్యానికి కాలు దువ్వారు. కాపు సామాజికకార్పొరేటర్లు చేస్తున్న వ్యాపారాలపై సంబంధిత అధికారులతో దాడులు చేయిస్తూ, వారిని తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎమ్మెల్యే వెలంపల్లి వేధింపులు తాళలేక కాపు సామాజికవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు.
వెలంపల్లి అనుచరుడు కొండపల్లి బుజ్జి ఆగడాలు తట్టుకోలేక మరో కాపు కార్పొరేటర్ తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డాడు.