హైదరాబాద్ లోని హెచ్.సి.యు పరిధిలో పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పాలకుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వెల్తూరి నగేష్ తీవ్ర విమర్శలు చేసారు. ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు తయారైన ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేయడం తెలంగాణ యువత తట్టుకోదని, ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెబుతుందని ప్రజలు అన్నారు. ఈ ప్రాంతంలో వేలాది వృక్షాలు, లక్షలాది జీవులు ఉన్న అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే బాధ్యతను విస్మరిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని, కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ తెలిసినప్పటికీ, ఇలా అడవిని నాశనం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తెలంగాణ యువత కోరుతోందని అన్నారు.
Share this content:
Post Comment