ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వేములపాటి అజయ్ జన్మదిన వేడుకలు

నెల్లూరు, ఏపీ టిడ్కో చైర్మన్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆత్మకూరు ఆంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ సహకారంతో జనసేన పార్టీ మండలాల ఇన్చార్జులు మరియు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మకూరు 100 పడకల జిల్లా హాస్పిటల్ నందు 100కు పైగా గర్భిణి స్త్రీలకు, రోగులకు బ్రెడ్స్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ లు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పేట జనసేన పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అక్బర్ బాషా, ఆత్మకూరు నియోజవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్, జనసేన పార్టీ పట్టణ నాయకులు గడ్డం వంశీ, ఆత్మకూరు రూరల్ నాయకులు శ్రీరామ్, పవన్, భాను చంద్ర, వినయ్, చంద్రారెడ్డి, వెంకటేష్, నజీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment