రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన వేమూరు జనసేన

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి బాపట్ల జిల్లా, వేమూరు నియోజవర్గంలో ఉన్న డా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జనసైనికులు పూలమాలవేసి 132వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమారౌతు అనురాధ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, తత్వవేత్త, సంఘసంస్కర్త, అపర మేధావి , భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత అని కొనియాడారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలుపరచడం లేదు. కేవలం వారి సొంత రాజ్యాంగాన్ని అమలుపరిచి అగ్ర భాగాన ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ ను అట్టడుగు స్థాయిలో ఉంచారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన వారి వారి సొంత రాజ్యాంగమును అమలు చేయడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 30 35 శాతం పేదరికంలోనే మగ్గుతున్నారు. అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న కనీసం నాలుగు శాతం కూడా పేదరికం తగ్గించలేకపోయారు గత ప్రభుత్వము స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని గొప్పలు చెప్పుకొని వారి సొంత ఎజెండా వలన రజిత ఆంధ్ర ప్రదేశ్ కూడా చేయలేకపోయారు అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమములో జనసైనికులు వీరమహిళలు కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ లు పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ అన్ని గ్రామములో ఘనముగా చేయడం జరిగింది.