భారతదేశ అభ్యున్నతికి మహనీయుడు అంబేద్కర్ చేసిన సేవలు అజరామమైనవి: వాసగిరి మణికంఠ

గుంతకల్, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సేవా సమితి గుంతకల్ పట్టణం, బెంచికొట్టాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట వాసగిరి మణికంఠ, జనసేన నాయకులు, జనసైనికులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి తర్వాత మెగా రక్తదాన శిబిరంలో తానే స్వయంగా రక్తదానం చేసి తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు తన అద్భుతమైన ప్రతిభతో భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి, భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి కారణమైన మహనీయుడు, అనగారిన వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అజరామరమైనవి. ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కొనసాగించాలని, ఆయన రాజ్యాంగం ద్వారా అందించిన విలువలను కాపాడుకుంటే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలా కాకుండా పదవులు ఉన్నాయనే అహంకారంతో రాజకీయ నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం. స్వాతంత్రం కోసం మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేశారు. వారి పోరాటాల స్ఫూర్తిని భావితరాల్లో నింపాలి అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురుబ పురుషోత్తం అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్.కృష్ణ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పామయ్య, ఆటో రామకృష్ణ, రమేష్ రాజ్, మంజునాథ్, అమర్నాథ్, కొనకొండ్ల శివ, రమేష్ రాజ్, సూర్యనారాయణ, అల్లు రవి, అనిల్ కుమార్, ఆటో బాషా,ఆటో కృష్ణ, శివ అంబేద్కర్ యువజన సేవా సమితి సభ్యులు, దానరాజ్, ఆండ్రూస్, రాజశేఖర్, శంకర్, బి కే శివయ్య, వీరేష్, రవికుమార్, వీరేంద్ర, వీరేష్, పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి, జనసేన పార్టీ నాయకులు, నిస్వార్థ జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.