ఎమ్మెల్యే రంగనాథ రాజుపై ద్వజమెత్తిన వెంగళదాసు దానయ్య

ఆచంట నియోజకవర్గం: ఆచంట ఎమ్మెల్యే రంగనాథ రాజు పై పశ్చిమగోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య ద్వజమెత్తారు. బుధవారం విలేకరులతో దానయ్య మాట్లాడుతూ.. ఆచంట ఎమ్మెల్యే శ్రీ రంగనాథ రాజు గారికి నమస్కారములు మీది మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు. ముందు మీరు సిద్ధాంతం గ్రామంలో స్మశాన వాటిక కోసం ఇచ్చిన హామీ ఎంతవరకు పూర్తి చేశారన్నదే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. అలాగే గ్రామాలలో రోడ్లు బాగు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి సుమారు నాలుగు సంవత్సరాల కాలం అవుతున్నా ఇప్పటికే ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టు ఆ రోడ్లు అలాగే ఉన్నాయి వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. మీ మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలా మీకు మీ సొంత నియోజకవర్గమై ఉండి నియోజకవర్గంలో పోటీ చేయలేని దుస్థితి. అలాగే ఇప్పుడు ఆచంట నియోజకవర్గంలో మళ్లీ గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి ఉండి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. మీకు మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మా జనసైనికుని ఎవరిని నిలబెట్టినా మీ మీద అధిక మెజారిటీతో గెలుస్తారు. ముందు మీరు వచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేసి పెనుగొండకు తెస్తానన్న ఫైర్ స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు ఫైర్ అయితే బాగుంటుందని తెలియజేసారు.