ఘనంగా వీరంకి వెంకయ్య జన్మదిన వేడుకలు

ముదినేపల్లిలో ఘనంగా వీరంకి వెంకయ్య గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన మండల జనసేన నాయకులు..

జనసేన పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ కైకలూరు నియోజకవర్గంలో రాబోయే 2024 ఎలక్షన్ లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా అహర్నిశలు ప్రజలకు, నియోజకవర్గం నాయకులకు, జనసైనికులకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి క్షణం దిశానిర్దేశం చేస్తూ నాయకులను, జనసైనికులను, జనసేన పార్టీ కుటుంబసభ్యులను అందరిని ఏక తాటిపై నడిపిస్తున్న పెద్దలు జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు శ్రీ వీరంకి వెంకటేశ్వరరావు(వెంకయ్య) గారి జన్మదిన వేడుకలు ముదినేపల్లి జనసేన పార్టీ ఆఫీస్ నందు భారీగా నిర్వహించారు.ఈ సందర్బంగా వెంకయ్య గారు మాట్లడుతూ ఎన్నడూ లేని విధంగా నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందకారం అని నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.