వెంకట కృష్ణాపురం పంట పొలాలలను పరిశీలించిన తుమ్మల

పెద్దాపురం: సామర్లకోట మండలం, వెంకట కృష్ణాపురం గ్రామాన్ని అనుకుని ఉన్నటువంటి పొలాలలను తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. పొలాలు చెరువులను తలపిస్తున్నాయని, కోట కాలువ పూడికతీత పనులు చేయక పోవడం వలన కాలవలో తూటి కాడ గుర్రపు డెక్క మరియు చెత్తాచెదారంతో నిండిపోయి నీరు కిందకి లాగకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ పంట నీట మునిగిన పంటనీ పరిశీలించాలని, ఇప్పటికే రైతు ఎకరానికి 12 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, ఇదంతా గంగపాలు అయిందని అక్కడికి వచ్చినటువంటి పౌలురైతులు వాపోయారు. దీనిపై స్పందించిన తుమ్మల రామస్వామి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేయడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దొరబాబు గారు గాని అలాగే ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు గాని మీరిద్దరూ ఈ సమస్య మీద పరిష్కారానికి పూనుకోవాలని తుమ్మల రామస్వామి బాబు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు, సామర్లకోట పట్టణ అధ్యక్షులు సరోజ వాసు, వెంకటకృష్ణాపురం రైతులు, వెంకట కృష్ణాపురం ఎంపీటీసీ శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.