ఘనంగా వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం

కడప పట్టణంలోని హరిత హోటల్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మంత్రితో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, మరియు కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రాధాన్యత, కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ పాత్ర, మరియు బీజేపీ భావితరాలు గురించి స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, నగర అధ్యక్షుడు బొరెడ్డి నాగేంద్ర, నగర కార్యదర్శులు చార్లెస్, వెంకటేష్, అశోక్, తరుణ్, పొలిటికల్ సెక్రటరీ ఫ్రాన్సిస్, అలీ, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-04-02-at-8.09.02-PM-576x1024 ఘనంగా వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం

Share this content:

Post Comment