వెంకటేష్, రానా మల్టీస్టారర్‌కు ముహూర్తం ఖరారు..

సీనియర్ టాప్ స్టార్ వెంకటేష్, రానా మల్టీస్టారర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో గత కొన్నేళ్లుగా వెంకటేష్ వరుసగా మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు వేరే హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీలు చేసిన వెంకటేష్ .. గతేడాది మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేసాడు. తాజాగా వెంకటేష్.. అబ్బాయి రానాతో కలిసి మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా తయారు అయినట్టు స్పష్టం అయ్యింది. అయితే ఈ సినిమా తమిళంలో హిట్టైన ఓ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అని చెబుతున్నారు. మరి తెలుగు లో ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

బాబాయి, అబ్బాయిల మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఒకవేళ ఐతే.. వెంకటేష్ బర్త్ డే డిసెంబర్ 13న ఈ సినిమా ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీని వీరూ పోట్ల డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి.