రజనీకాంత్‌ అభిమానులకి వెంకటేశ్‌ సర్‌ప్రైజ్‌.. ‘పెద్దన్న టీజర్‌ అదుర్స్!

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ నటుడు వెంకటేశ్‌ టీజర్‌ని విడుదల చేశారు.

రజనీకాంత్ స్టైల్ .. ఆయన మార్క్ యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. రజనీకాంత్‌ లుక్స్‌, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్‌ అలరిస్తోంది.  టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాలనే దర్శక నిర్మాతల ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. గతంలో రజనీతో భారీ హిట్లు అందుకున్న ఖుష్బూ .. మీనా .. నయనతార ఈ సినిమాలో ఆయన సరసన కనిపిస్తుండటం విశేషం.