మెరిట్ విద్యార్థిని జయలక్ష్మిని అభినందించిన వైస్ ఛాన్సలర్

  • ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన సి.ఈ, ఏ.సి.ఈ తదితరులు

ఇటీవల విడుదలైన డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో 9.61 జి.పి.ఏ తో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ స్థాయిలో మూడో సెమిస్టర్ నందు మొదటి ర్యాంకర్ గా నిలిచిన కనిగిరిలోని ఏ.ఎల్.ఎన్.ఎం అండ్ వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని మితుకుల జయలక్ష్మిని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి హృదయపూర్వకంగా అభినందించారు. మంగళవారం ఉదయం సదరు కళాశాల కరస్పాండెంట్ రామన విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ ఎన్.వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి జయలక్ష్మి వి.సి ప్రొఫెసర్ మూర్తిని ఆయన ఛాంబర్ నందు కలిసి తాను సాధించిన మార్కుల గురించి ప్రిన్సిపాల్ ద్వారా తెలియజేశారు. వెనుకబడిన ప్రాంతమైన కనిగిరికి చెందిన జయలక్ష్మి సాధించిన అత్యుత్తమ ప్రతిభ గురించి తెలుసుకున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అంతే కాకుండా ఒక జ్ఞాపికను కూడా అందజేశారు. ఈ సందర్భంగా వి.సి ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ సదరు డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ (జువాలజీ) చదువుతున్న జయలక్ష్మి మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలలో అన్ని విభాగాలలో అత్యుత్తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి యూనివర్శిటీ స్థాయిలో మొదటి ర్యాంకును పొందినట్లు ఆయన ప్రశంసించారు. జయలక్ష్మిని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ లో అత్యుత్తమ ఫలితాలను సాధించి యూనివర్శిటీకి తద్వారా విద్యాబుద్దులు అందించిన కళాశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని సూచించారు. ఈ సందర్భంగా మెరిట్ విద్యార్థిని జయలక్ష్మిని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ సి.ఈ డాక్టర్ కే.వి.ఎన్.రాజు, ఏ.సి.ఈ డాక్టర్ అంచుల భారతీదేవి, పి.జి.కో-ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్ విభాగం) డాక్టర్ ఆర్.శ్రీనివాసులు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎల్.ఎన్.ఎం అండ్ వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యంతో బాటు కళాశాల అధ్యాపకుడు హానోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment