శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న విడివాడ

తణుకు నియోజకవర్గ ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవము మరియు అన్న సమారాధన కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు జనసేన నాయకులు జవ్వాది ప్రసాదు మరియు ఇరగవరం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.