శ్రీ విజయ గణపతి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విడివాడ

తణుకు నియోజకవర్గం: తణుకు మండలం, వేల్పూర్ గ్రామంలో ఎన్.టి.ఆర్ కాలనీ నందు పునః నిర్మించిన శ్రీ విజయ గణపతి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు పాల్గొని, స్వామివారి ఆశీస్సులు అందుకుని, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు పట్టణం ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, కేశవ, మరియు వేల్పూరు గ్రామం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.