*సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపిణి చేసిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు
రాజంపేట పట్టణంలోని జెట్‌పీ గల్స్ హై స్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకుడు యల్లటూరు శివరామరాజు బుధవారం పాల్గొని విద్యార్థులకు కిట్లు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వసతులను సమకూరుస్తుందని శివరామరాజు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా దేశనాయకుల గౌరవాన్ని చాటిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన విద్యార్థుల్లో అభివృద్ధి దిశగా ఆలోచనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, పట్టణ నాయకులు మావిళ్ళ రవి, మండల నాయకులు కోలాటం హరికృష్ణ, లక్ష్మీపతి రాజు, పలుకూరి శంకర్, నారదాసు రామచంద్ర, తోట సురేష్, రాజంగారి సూర్యనారాయణ, పూల లక్ష్మి నరసయ్య, గూడూరు శ్రీనివాసులు, శివశంకర్ రాజు, గాజుల కులాయప్ప తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment