కప్పడ గ్రామంలో జాగరపు పవన్ పర్యటన

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, కప్పడ గ్రామంలో.. జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాగరపు పవన్.. జనసేన పార్టీ సిద్ధాంతాలు గ్రామస్తులకు తెలుపుతూ.. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సిద్ధాంతాలు మన దేశాన్ని మార్చే శక్తివంతమైన సిద్ధాంతాలుగా, మన గిరిజన బ్రతుకులు మార్చే విధంగా ఉన్నాయి. అంటే జనసేన సిద్ధాంతాలు ఒక మార్పుకు నిదర్శనం.. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మన జనసేన పార్టీని గెలిపించుకోవాలని గ్రామస్తులకు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి యొక్క సమస్యలను జనసేన నాయకులకు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్, జనసైనికులు పి. రామన్న, కె జీవనం పి బాలు ఈ సందర్భంగా పాల్గొనడం జరిగింది.