రాష్ట్రానికి పట్టిన విగ్నం (జగన్ రెడ్డి) తొలగి పోవాలి: నేరెళ్ల సురేష్

గుంటూరు: వినాయక చవితి పండుగ సందర్బంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం 12డివిజన్ జనసేన అధ్యక్షులు కొణిదె దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయకుని విగ్రహాలను జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంచార్జి నసీర్ అహ్మద్ డివిజన్ జనసేన మరియు టిడిపి నాయకులుతో కలిసి గుంటూరు 12 వ వార్డులో జనసేన పార్టీ కార్యాలయం నందు, మరియు చిన్న బజార్ గాంధీ బొమ్మ వద్ద, మరియు లాలాపేట పోలీస్ స్టేషన్ ఎదురు ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నేరెళ్ల సురేష్ మరియు నసీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ దేవుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు, టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అక్రమ అసత్య కేసు నుండి త్వరగా విడుదలవ్వాలని అలాగే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రజలు అనేక రకాలు ఇబ్బందులుకు గురిచేస్తున్నాడని రాష్ట్రానికి ఆతి పెద్ద విగ్నం జగన్ రెడ్డి తొలిగిపోవాలానీ ప్రజలు కోరుకుంటూన్నారని కాబ్బటి నేడు ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 12 డివిజన్ జనసేన నాయకులు అనిల్, హరి, అంజన్, రాజేష్, రవి, శ్రీను, మురళి, మణికంఠ, పండు, లలిత, టీడీపీ నాయకులు 12 వ వార్డు టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ సలీం, హఫీజ్, రఫీ, అన్వర్, రాజేష్, జనసేన మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.