జోరుగా యువశక్తి ప్రచారం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు కరిమజ్జి మల్లీశ్వరరావు అధ్వర్యంలో గురువుబిల్లి, బంటుపాలేం, భీముడుపాలెం, అధపాక బుడుమూరు, పట్టుశాలిపేట, కామర్సిపేట, అల్లినగరం, అరంగిపేట, గుంటుకపేట, మురపాక, చినమురపాక, కేశవరాయణపాలెం గ్రామంలో ఆదివారం ఉదయం నుండి శరవేగంగా విసృత ప్రచారం జరిగింది. ప్రతి గ్రామం ప్రతీ వాడ, ప్రతీ వీధి, ప్రతి పల్లె, ఉరూ ఊరు ప్రచారం చేయడం జరిగింది. మన యువతే మన భవిత గురించి బహిరంగ సభ గురించి ప్రజలకు వివరించడం జరిగింది. 12వ తేదిన పవన్ కళ్యాణ్ రణస్థలం దగ్గర సుభద్రపురం సెంటర్ వద్ద బహిరంగ సభకు వస్తున్నారు కనుక యువశక్తి బారీ బహిరంగ సభకు ప్రజలు యువకులు యువతీ భారీఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని, ఈ కార్యక్రమంలో కృష్ణాపురం పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, కెల్లా రాము, శనపతి సూరినాయుడు, ఎచ్చెర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.