భీమిలిలో జోరుగా యువశక్తి ప్రచారం

భీమిలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన యువశక్తి మన యువత మన భవిత రేపటి తరాల భవిష్యత్తు కోసం జనసేనాని జనవరి 12వ తేదీన రణస్థలంలో జరుగనున్న యువశక్తి కార్యక్రమం కోసం భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల సూచనల మేరకు ఒమ్మి దేవి యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం 7 గంటల నుండి కొమ్మది రైతు బజారులో మరియు భవన నిర్మాణ కార్మికులకు, విద్యార్థులకు యువశక్తి కార్యక్రమం కోసం వివరించడం జరిగింది. ఒమ్మిదేవి యాదవ్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది కొన్ని లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారని ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రానికి తరలిపోతున్నారని ఎంత ఉన్నది చదువులు చదువుకున్నా సరే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5000 రూపాయలకు పనిచేసే వాలంటరీలు తప్ప మరేమి చేసింది లేదు అని విద్యార్థులకు ఏ ఉపాధి ఉపయోగం లేకుండా పోయిందని చెప్పి దేవి ఈ విధంగా తెలియజేశారు. యువత కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువ శక్తి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మన యువత మన భవిత అని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా రణస్థలంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నామని ఆ సభకు ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకుల శివ, యడ్ల గణేష్ యాదవ్, సాగర్ మల్ల, చిన్న, శ్రీను, విజయ్, ప్రసాద్, వెంకట్ సాయి, పంచాదర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.