5 వ సారి ప్రేమలో పడిన వనితా విజయ్ కుమార్..

తమిళ హీరోయిన్ వనితా విజయ్ కుమార్ 5వ సారి ప్రేమలో పడి అందరికీ షాక్ ఇచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ కుమార్, దివంగత నటి మంజుల కూతురే వనిత. ‘దేవి’ మూవీతో తెలుగులో మెరిసింది. ఆ తరువాత కొన్ని చిన్న సినిమాలలో కూడా కీలక పాత్రలలో కనిపించింది. కానీ.., తమిళంలో గాని, తెలుగులో గాని ఈమెకి లైఫ్ లో సెటిల్ అయిపోయే అవకాశాలు లభించలేదు. దీనితో.., 2000 సంవత్సరంలో ఆకాశ్‌ను పెళ్లాడింది వనిత. 7 ఏళ్ళ పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ జంటకి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. కానీ.., 2007 లో విడిపోయారు. ఇక అదే ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త జయ్ రాజన్‌ను వనితా రెండో పెళ్లి చేసుకుంది.ఆ వివాహ బంధం కూడా కేవలం ఐదేళ్లు మాత్రమే నిలిచింది. అయితే.., ఈసారి మాత్రం విజయ పెళ్లి జోలికి పోలేదు. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ల పాటు లివింగ్ రిలేషన్‌లో ఉండింది. కానీ.., 2017లో ఈ ప్రేమ ప్రయాణానికి బ్రేక్ పడింది.ఇక ఈ ఏడాది జూన్ 27న దర్శకుడు పీటర్ పాల్‌ని వనిత మూడోవ పెళ్లి చేసుకుంది. పెళ్లిలోనే ఈ జంట ముద్దులు పెట్టుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. కానీ.., వనితా విజయకుమార్ ఈ బంధాన్ని కూడా ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. మరోవైపు పీటర్ కూడా మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే వనితని వివాహం చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో పీటర్ మద్యానికి బానిస అయిపోవడంతోవనిత అతని నుండి దూరం వచ్చేసింది. అయితే ఈ వెటరన్ బ్యూటీ ఇప్పుడు మరోసారి.. అంటే ఐదవ సారి ప్రేమలో పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా వనిత విజయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. మళ్లీ ప్రేమలో పడ్డా.. ఇప్పుడు మీరు హ్యాపీనే కదా అని పోస్ట్ పెట్టింది ఈ హీరోయిన్. దీనితో.. ఈమె తెగింపుకి ప్రేక్షకులు కూడా నోర్లు వెళ్లబెడుతున్నారు.