నీలాద్రిరావుపేటలో విజయ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి ఎంతగానో సేవ చేసిన నీలాద్రిరావుపేట జనసైనికుడు కారుకొండ విజయ్ కుటుంబ సభ్యులను విడిచి మనకు అందనంత దూరానికి వెళ్లిపోవడం మనకి తీరని లోటు. మన విజయ్ ని స్మరించుకుంటూ అతని జ్ఞాపకార్ధంగా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో విజయ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది. గ్రామ పెద్దలు, యువకులు, జనసైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కి పెద్దల పిలుపు మేరకు విచ్చేసి టోర్నమెంట్ ప్రారంభించి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు రూపాయలు 10000/- జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యచంద్ర క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసి ఏలేశ్వరం మరియు గోనేడ-బి జట్ల మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో నిస్వార్థంగా మన జనసేన పార్టీకి సేవలు అందించిన విజయ్ ని కోల్పోవడం చాలా బాధాకరం, కానీ విజయ్ చేసిన సేవలను తను మనందరితో కలిసి తిరిగిన జ్ఞాపకాలను మరిచిపోకుండా స్మరించుకుంటూ ఉండడానికి విజయ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నీ ప్రతి సంవత్సరం కొనసాగించడం జరుగుతుందని దాని కొరకు ప్రతి సంవత్సరం నా వంతుగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలియచేశారు. తదుపరి క్రీడాకారులతో కొంత సమయం క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.