గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మహేష్ కోసం మొక్కను నాటిన విజయ్

రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతూ  ఇప్పటికే రెండు విడతలు విజయవంతoగా ముగియగా… మూడో దశ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రభాస్ చేత ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి ఈ సవాల్ అలా కొనసాగుతున్న క్రమంలో మహేష్ బాబు తన పుట్టిన రోజున మొక్కలను నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎన్టీఆర్, విజయ్, శ్రుతీ హాసన్‌లకు పాస్ చేస్తున్నాను. ఈ పరంపరను కొనసాగించాలి. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరంతా సహకరించాలి. పచ్చని ప్రపంచం కోసం ముందడగు వేద్దామ’ని పేర్కొన్నాడు. తాజాగా ఈ మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను విజయ్ స్వీకరించాడు.

దళపతి విజయ్ మహేష్ ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటి ఆవరణలోనే మొక్కను నాటాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. మహేష్ బాబు గారు ఇది మీ కోసమే.. మంచి ఆరోగ్యం పచ్చని భారతదేశం రావాలి.. థ్యాంక్యూ సురక్షితంగా ఉండండ’ని ట్వీట్ చేశాడు. ఇక ఈ మేరకు విజయ్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ చేసిన ట్వీట్‌కు మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ఈ ఛాలెంజ్‌ను తీసుకుని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్స్ బ్రదర్.. సురక్షితంగా ఉండండ’ని తెలిపాడు.