విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా 11వ డివిజన్ బరిలో దిగిన కేశినేని శ్వేత విజయం సాధించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 19 డివిజన్లలో వైసీపీ జయకేతనం ఎగురవేయగా, టీడీపీ 4 స్థానాల్లో నెగ్గింది. ఇతర డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ విషయానికొస్తే… మొత్తం 57 డివిజన్లలో 43 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. ఒకస్థానం అంతకుముందే వైసీపీకి ఏకగ్రీవం అయింది. దాంతో వైసీపీ ఖాతాలో 44 డివిజన్లు ఉన్నాయి. టీడీపీకి 9 డివిజన్లలో విజయాలు లభించాయి.

ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీదే పైచేయిగా ఉంది. విశాఖ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 90 డివిజన్లు ఉండగా… వైసీపీ 11, టీడీపీ 9, జనసేన 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 నెగ్గారు. కాగా, విశాఖలో ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాసివున్న స్లిప్పులను గుర్తించారు.