ఉప్పెన రీమేక్ లో విజయ్ కుమారుడు ..?

వైష్ణవ్ తేజ్ , కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంచనాలకు రెట్టింపు గా సినిమా ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతుంది. తాజాగా ఈ మూవీ ని తమిళ్ రీమేక్ చేయాలనీ చూస్తున్నారట.

తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు సాధించిన విజయ్..తన కుమారుడ్ని ఇండస్ట్రీ కి మంచి కథతో హీరోగా పరిచయం చేయాలనీ ఎప్పటి నుండి చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఉప్పెన కథను అందరు మెచ్చుకోవడం తో దీనిని తమిళంలో రీమేక్ చేస్తూ, తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే నిర్మాతలతో రీమేక్ హక్కుల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.