ఆదిత్య కోసం విక్రమ్‌ వేటే ‘బోగన్‌’

జయంరవి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘బోగన్‌’ అదే పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాత మాట్లాడుతూ ”బ్యాంక్‌ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ, నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్‌ అనే పోలీస్ ఆఫీసర్‌ కథే ఈ సినిమా. ఊహించని మలుపులతో సీట్‌ ఎడ్జ్‌లో కూర్చొని చూసేలా ఈ చిత్రం ఉంటుంది. విక్రమ్‌ ఐపీఎ్‌సగా జయం రవి, ఆదిత్యగా అరవింద్‌ స్వామి అద్భుతంగా నటించారు. హాలీవుడ్‌ థ్రిల్లర్‌లా దర్శకుడు తెరకెక్కించారు. హన్సిక గ్లామర్‌ సినిమాకు ప్లస్‌ అవుతుంది. ఈ నెల 26న ట్రైలర్‌ విడుదల చేసి, త్వరలో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు.