*జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్
కొణిదెల పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలంలోని చినపలకలూరు గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కొండకు సమీపంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు, వరదనీరు ఇళ్లవద్దకు చేరకుండా ఆపే చర్యలు చేపట్టారు. జేసీబీ మరియు ట్రాక్టర్ సహాయంతో చెత్తను తొలగించి, కాలువ తీయించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ, గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్య గురించి తమకు తెలియజేయగానే, వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని, ఆ మాట ప్రకారం తమ స్వంత నిధులతో పనులు చేయించామని తెలిపారు. గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తమకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, మండల కార్యదర్శులు గణితి ధనసాయికుమార్, బొందలపాటి సాంబశివరావు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల ఏడుకొండలు, గణితి శంకరరావు, గ్రామ కార్యదర్శులు తుమ్మల సురేష్ కుమార్, పాలపాటి శేఖర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment