రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబానికి మూలాలున్న మొగల్తూరు గ్రామ పంచాయతీ అభివృద్దికి ఆయన ఆదేశాల మేరకు నివేదికలు సిద్ధం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ ఎం. కృష్ణతేజ తెలి పారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు అయిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు వారు పుట్టి, పెరిగిన గ్రామం మొగల్తూరు అభివృద్ధికి ముందుకు వచ్చారన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం మొగల్తూరులో గ్రామ అభివృద్ధి సమావేశం నిర్వహించినట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మొగల్తూరులోని పలువురు ప్రస్తుతం, మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ ఎంతో పురాతన ప్రాసత్త్యం ఉన్న రాజరిక వ్యవస్థ కొనసాగిన ఈ గ్రామంలో ఎం. తో మంది సీనీ, రాజకీయ, శాస్త్ర, రక్షణ రంగాలలో పేరుపొందినవారున్నారు. అటువంటి గ్రామం నుండి సినీ హీరోగా రాజకీయ రంగంలో తనదైన రీతిలో కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు మేజర్ పం చాయతీ అయిన మొగల్తూరులో గ్రామస్తులు అందించిన విన్నపాలను తీసుకోవడం జరిగిందని కృష్ణతేజ తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ మామిడిశెట్టి సత్యనారాయణ, కోట సంస్థాన వారసులైన కలిదిండి స్వర్ణ కుమార్ బాబు, ప్రసు త సర్పంచ్ పడవల మేరీ సత్యనారాయణ, వార్డు సభ్యులు మాట్లాడుతూ మొగల్తూరు పంచాయతీ పరిధిలో అపష్కతంగా ఉన్న కోనాయికోడు, మొగల్తూరు ప్రధాన కాలువలను ప్రక్షాళన చేయాలని గ్రామంలో నూరుశాతం డ్రెయినేజీ నిర్మాణం చేయాలని, పంచాయతీకి డంపింగ్ యార్డ్ కు అసవరమైన స్థలాన్ని కేటాయించాలని, గతంలో చిరంజీవి కుటుంబ సభ్యులు సాగు చేసుకున్న వ్యవసాయభూములు ప్రస్తుతం ముంపుకు గురవ్వుతున్నాయని ఆసమస్య పరిష్కరించేందుకు దర్భరేవు డ్రెయిన్ ప్రక్షాళన చేయాలని విన్నవించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు మాట్లాడుతూ మొగల్తూరు ప్రజల సమస్యలను, అర్జీలను వెంటనే పరిష్కారం అయ్యేలా చేసే అధికారులు ను కోరారు. ఈ గ్రామ సభలో కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టిడిపి ఇన్చార్జ్ పొత్తురి రామరాజు, రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళి కృష్ణ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కిషోర్, జిల్లా పంచాయతీ అధికారి అరుణ శ్రీ డిసిఎం పేషీ అధికారులు ఓఎస్ కె.వెంకట కృష్ణ, జి.ఆర్ మధుసూధన్, శివరామకృష్ణ సర్పంచ్ పడవల మేరీ, తహసీల్దార్ కె.రాజ్ కిషోర్, ఎంపీడీవో సిహెచ్ త్రిశూల పాణి, పంచాయతీ కార్యదర్శి ముచ్చర్ల నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ బోణం నర్సింహరావు తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment